పవన్ వర్సెస్‌ విజయ్‌!

awposter
1 Min Read

టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్ మూవీ “హరిహర వీరమల్లు” కూడా ఓ సినిమా. మరి ఈ చిత్రంని మేకర్స్ మే 9 కి ప్లాన్ చేశారు. కానీ ఈ తేదీలో కూడా ఈ సినిమా వచ్చే సూచనలు ఏమి కనిపించడం లేదు. దీంతో ఆల్రెడీ సమంత తన ప్రొడక్షన్ సినిమాని ఆ డేట్ కి లాక్ చేసుకునే సరికి పవన్ సినిమా రావడం లేదు అనే టాక్‌ వినపడుతుంది.

అయితే ఇపుడు పవన్ విజయ్ దేవరకొండ డేట్ కి వస్తున్నట్లు తెలుస్తుంది. మే 30న విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం కింగ్డమ్ వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ డేట్ లో వీరమల్లు వచ్చే ఛాన్స్ ఉందట. అది కూడా ఈ మధ్యలో పవన్ ఏమన్నా డేట్స్ ఇస్తే ఆ డేట్ కి మేకర్స్ రావాలనుకుంటున్నారట. లేదా జూన్ కే షిఫ్ట్ అవుతుంది అని తెలుస్తుంది. మరి దీనిపై ఒక క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share This Article