పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమాల్లో ఓజి కూడా ఒకటి. ఈ సినిమాను సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా, క్రైమ్ థ్రిల్లర్ స్టైల్‌లో తెరకెక్కిస్తున్నారు. కానీ ఈ సినిమా నిజంగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అన్న సందేహం అభిమానుల్లో నెలకొంది. షూటింగ్ దాదాపు పూర్తయిందని, ఇంకా కొన్ని రోజులు మాత్రమే పని మిగిలి ఉందని టాక్ వస్తోంది. అసలైతే ప్యాచ్ వర్క్ కూడా రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో ఓజి సెప్టెంబర్ మూడో వారంలో థియేటర్లలోకి వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు సంగీతం తమన్ అందించారు. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ కీలకమైన విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. డివివి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంపై పవన్ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి
