పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలంటే అభిమానులకు ఎప్పుడూ ఓ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. తాజాగా ఆయన నటించిన “ఓజి” విషయంలోనూ అదే ఉత్సాహం కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే చాలా బజ్ క్రియేట్ చేసుకుంది. దానికి కారణం ఒక్కటే కాదు, అనేక అంశాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా మాట్లాడించుకున్నది పవన్ కళ్యాణ్ పేరు కనిపించిన టైటిల్ కార్డ్.
ఇప్పటికే లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో హీరో ఇన్‌ట్రడక్షన్ ను కొత్త స్టాండర్డ్స్ కి తీసుకెళ్లాడు. కానీ సుజీత్ మాత్రం పవన్ కోసం తనదైన స్టైల్ లో, అభిమానులు ఊహించని విధంగా ఒక స్పెషల్ డిజైన్ చేశాడు. థియేటర్‌లో టైటిల్ కార్డ్ పడిన క్షణం నుంచి ఫ్యాన్స్ కేకలతో దద్దరిల్లిపోయారు.
కేవలం ఆ విజువల్ చూసేందుకు కూడా టికెట్ విలువ వసూల్ అయిపోయిందనిపించేలా సెట్ చేశారు. ఈ సన్నివేశం చూసినప్పుడు ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా మైండ్ బ్లాంక్ అయ్యేంతగా ఇంపాక్ట్ ఫీల్ అయ్యారు.
