పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తాజా సినిమా ఓజి విడుదలైన వెంటనే పెద్ద స్థాయిలో హడావిడి సృష్టిస్తోంది. ప్రేక్షకుల్లో ముందే ఏర్పడ్డ హైప్ కి తగ్గట్టుగానే ఈ చిత్రం మొదటి షోలు నుంచే జోరు చూపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా సహా విదేశాల్లో కూడా ప్రీమియర్ షోలు హౌస్‌ఫుల్ గా జరిగాయి.
ప్రత్యేకంగా యూఎస్ మార్కెట్ లో ఈ సినిమా అద్భుతమైన ప్రారంభాన్ని నమోదు చేసింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ సాధించి టాలీవుడ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇంత పెద్ద ఓపెనింగ్ రావడం పవన్ కల్యాణ్ క్రేజ్ కి మరో సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.
ఇకపై మొదటి రోజు కలెక్షన్లు, తర్వాతి రోజుల లాంగ్ రన్ ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, నిర్మాణ బాధ్యతలను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ చూసుకున్నారు.
