పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా పై ఎంతగా ఆసక్తి నెలకొంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి రూపొందించారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కి సిద్దమవుతోంది. జూలై 3న ఉదయం 11:10 గంటలకు ఈ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే ట్రైలర్ ఫైనల్ కట్ పూర్తయ్యిందట. పవన్ కళ్యాణ్ కూడా ఈ ట్రైలర్‌ను చూసినట్లు సమాచారం. ఆయన ఈ కట్ పై సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ట్రైలర్‌పై పవన్ ఇలా స్పందించాడంటే, దాని స్థాయిలో ఎంత ఇంపాక్ట్ ఉండబోతోందో అర్థం అవుతుంది. అభిమానులు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్, పాత్రల డిజైన్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉండబోతున్నాయనే మాట వినిపిస్తోంది.
నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఏఎం రత్నం భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
