టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం నటుడిగానే కాకుండా పలు రంగాల్లో తన ప్రత్యేక ప్రతిభను చూపిస్తుంటారు. ఆయన నటనతో పాటు యాక్షన్ కొరియోగ్రఫీలో కూడా నైపుణ్యం కలిగి ఉన్న విషయం చాలామందికి తెలిసిందే. గతంలో కొన్ని సినిమాల్లో స్వయంగా యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేసిన పవన్ కళ్యాణ్, ఇటీవల మళ్లీ అటువంటి ప్రయత్నం చేశారు.
‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ స్వయంగా చెప్పినట్లు, ఈ సినిమాలో క్లైమాక్స్ భాగంగా ఉన్న 18 నిమిషాల భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను ఆయనే డిజైన్ చేశారు. ఆయన యాక్షన్ స్టైల్ అంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకత, ఒక కొత్తతనం కనిపిస్తుంది కాబట్టి ఈ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
ఈ భారీ చారిత్రక చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ ఎం రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఈ కాంబినేషన్, ప్రత్యేకంగా పవన్ స్వయంగా రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్‌తో కూడిన క్లైమాక్స్, సినిమా కోసం ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను రేపుతోంది.
