‘ఓజీ’ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తూ తన స్టైల్‌తో ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్నారు. ఆయన లుక్, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కలిపి పవర్‌ఫుల్ ఇంపాక్ట్ కలిగించాయి. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు కొత్త ఎనర్జీని తీసుకొచ్చింది. అలాగే స్టైలిష్ మేకింగ్, శార్ప్ ఎడిటింగ్, భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
ఇందులో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో ఇతర ముఖ్యమైన పాత్రలను కూడా క్లియర్‌గా చూపించారు. మొత్తంగా ట్రైలర్ చూసినవారిలో సినిమా మీద ఆసక్తి ఇంకా పెరిగింది.
