మరోసారి గొంతు సవరించిన పవన్‌!

Monday, January 20, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తూ అసలు తీరిక లేకుండా ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఏపీకి ఉపముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ఇక ఆయన సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కూడా ఒకటొకటిగా తాజాగా బయటకు వస్తున్నాయి.

ఈరోజు దసరా సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక పోస్టర్ ని చిత్ర బృందం అభిమానుల ముందుకు తీసుకుని వచ్చింది. పోస్టర్లో పవన్ విల్లు ధరించి బాణాలు ఎక్కిపెట్టినట్లు  కనిపిస్తున్నారు. ఇక త్వరలోనే హరిహర వీరమల్లు ఫస్ట్ పాటని విడుదల చేయబోతున్నామని ఆ పాటని పవన్ కళ్యాణ్ పాడారని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తొలుత క్రిష్ డైరెక్టర్‌ గా వ్యవహరించారు. సినిమా వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో ఆయన దర్శకత్వ బాధ్యతలు నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఇక సినిమాని వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles