పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు పైన క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తంలో ఈ సినిమాకు మాస్ హంగామా మొదలైపోయింది. ఇటీవల బెంగళూరులో అభిమానులు పవన్ పెద్ద కటౌట్ ఏర్పాటు చేశారు. ఆ కటౌట్ దగ్గర ఫ్యాన్స్ పెద్ద ఎత్తున గ్యాదరింగ్‌తో సందడి చేశారు.
అయితే అక్కడ పవన్ కటౌట్ పక్కనే మరో ఆసక్తికర కటౌట్ కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అది పవన్ కుమారుడు అకిరా నందన్‌ది కావడంతో అటు ఫ్యాన్స్‌కి, ఇటు సోషల్ మీడియాలో వినూత్న చర్చకు దారి తీసింది. ఇద్దరి కటౌట్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక అప్పుడప్పుడే మీడియా ముందు కనిపించే అకిరా కోసం సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అతను ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటే ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
ఇక హరిహర వీరమల్లు సినిమా జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. పవన్ మళ్లీ మాస్ అవతారంలో కనిపించబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
