ప్రభాస్‌ సరసన పాక్‌ భామ!

Sunday, December 22, 2024

టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ విజయాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. అదే సమయంలో, ఈ సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాకు సంబంధించిన సన్నాహాల్లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

కల్కి తర్వాత ప్రభాస్‌ మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు, ప్రభాస్ హను రాఘవపూడితో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. హను రాఘవపూడితో ప్రభాస్ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఉండనున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న నటి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది.

ప్రభాస్‌తో రొమాన్స్‌ను జోడించే నటిని చిత్ర బృందం ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. రిపోర్టుల ప్రకారం ప్రభాస్ సరసన పాకిస్థాన్ నటి సజల్ అలీ నటిస్తుందని జోరుగా ప్రచారం సాగుతుంది. దివంగత నటి శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో సజల్ అలీకి మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్త నిజం అవునో కాదో అధికారిక సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు.

 కానీ మరో ప్రచారం కూడా జోరుగా  జరుగుతోంది. ఇమాన్ ఇస్మాయిల్ అనే పాకిస్థానీ నటిని హను రాఘవపూడి సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రభాస్ ను ఫాలో అవడం మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. దీంతో ఆమె హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా పెట్టుబడి పెడుతున్న సంగతి  తెలిసిందే. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. విశాల్ చంద్రశేఖర్ హను రాఘవపూడితో కలిసి ‘సీతా రామం’ విజయం సాధించిన తర్వాత ఈ చిత్రం కోసం మళ్లీ కలిసి పని చేయబోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles