ఫ్యాన్స్‌ ని ఊరిస్తున్న ఓజీ ఫస్ట్‌ సింగిల్‌!

Friday, September 27, 2024

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ నిన్నటి వరకు రాజకీయాల్లో ఫుల్‌ బిజీగా ఉండడంతో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలకు కూడా బ్రేక్ పడింది. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఇక నుంచి పవన్ సినిమాల సందడి షురూ మొదలు కానుంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి అనుకుంటున్నారు పవన్ కల్యాణ్.

దీంతో తన లైనప్ లో వున్న సినిమాలను పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యారు. ముందుగా ఎప్పటి నుంచో పెండింగ్ లో వున్న హరిహర వీరమల్లు షూటింగ్ లో పవన్ పాల్గొనబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే పవన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజి”.పవన్ కల్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజీత్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. మరో ఇరవై రోజులు షూటింగ్ చేస్తే ఈ సినిమా పూర్తి అవుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్స్‌  ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.

అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ తెగ వూరిస్తుంది.థమన్ ఆల్రెడీ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రెడీ చేసాడని సమాచారం.త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుందని థమన్ ట్వీట్ చేసారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles