పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఓజీ” సినిమా విడుదలైనప్పటి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. పవన్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద భారీ క్రేజ్ కనిపించడంతో వసూళ్లు ఊహించని స్థాయిలో వచ్చాయి.
ప్రత్యేకంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా రన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నార్త్ అమెరికాలో 5.5 మిలియన్ డాలర్ల గ్రాస్ ను దాటుతూ కొత్త మైలురాయిని చేరుకుంది. దీని ద్వారా ఫైనల్ రన్ కు దగ్గరగా వస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, ఓజీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద పవన్ పవర్ ను మరోసారి నిరూపించింది.
