పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజి”పై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సినిమా రిలీజ్ కి ముందు నుంచే మేకర్స్ చేసిన ప్రమోషన్స్ తో మంచి హైప్ క్రియేట్ చేశారు.
ఈ చిత్రంతో అనుబంధంగా మేకర్స్ ఒక వినూత్న ప్రయత్నం చేశారు. వన్స్ మోర్.ఐఓ అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో కలసి ప్రత్యేక క్యాంపైన్ ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ ప్రారంభమైన 48 గంటల్లోనే ఈ ప్లాట్‌ఫామ్‌కి ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల నుండి ఒక మిలియన్‌కి పైగా యూజర్లు రిజిస్టర్ కావడం గమనార్హం. ఈ స్థాయి స్పందన ఒక కొత్త ప్లాట్‌ఫామ్‌కి రావడం ప్రపంచస్థాయిలోనే అరుదైన విషయం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది చాట్‌జిపిటి, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి గ్లోబల్ యాప్‌ల ప్రారంభ రికార్డులను మించి ఉన్నదని కూడా సమాచారం. ఈ విజయంతో ఓజి టీమ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా దృష్టిని ఆకర్షించింది.
