భారతీయ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో బలమైన మార్కెట్ కలిగిన స్టార్ హీరోలలో ప్రభాస్, రజినీకాంత్ ఇద్దరూ ముందు వరుసలో నిలుస్తారు. ప్రభాస్ సినిమాలకు కర్ణాటకలో ఎప్పటినుంచో మంచి డిమాండ్ ఉంటుంది. ఆ క్రేజ్ వల్లే ఇప్పటివరకు ఆయన చేసిన ఆరు సినిమాలు అక్కడ ఇరవై కోట్లకు మించి వసూళ్లు సాధించాయి.
ఇక తాజాగా రజినీకాంత్ కూడా అదే రేంజ్‌లో నిలిచారు. ఆయన కొత్త సినిమా కూలీతో కర్ణాటక బాక్సాఫీస్‌లో ఈ మార్క్‌ను చేరుకుని ప్రభాస్ రికార్డుతో సమానమయ్యారు. అంటే కర్ణాటకలో ఇరవై కోట్లకుపైగా వసూలు చేసిన ఆరు సినిమాలు ఉన్న హీరోల జాబితాలో ప్రభాస్, రజినీకాంత్ మాత్రమే ఉన్నారు. ఈ రికార్డు దగ్గర మరో హీరో కనిపించకపోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
