దేవరకు మరోసారి లీకుల బెడద!

Andhrawatch
1 Min Read

లీకుల బెడ‌ద టాలీవుడ్‌ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు పెద్ద ముప్పుగా మారింది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నప్పటికీ స్టార్ హీరోల‌ లుక్‌లు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో బయటకు వచ్చేస్తునే ఉంటాయి. తాజాగా దేవర సినిమాలో ఎన్టీఆర్ రెండో లుక్ కూడా సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయిపోయాయి.  స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు డిఫరెండ్‌ పాత్రలలో సందడి చేయబోతున్నట్లు సమాచారం.

ఆ రెండో లుక్ లేటెస్టుగా లీక్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. సెట్స్ నుంచి ఎవరో ఫోటోలు తీసి రిలీజ్ చేయడంతో.. ఆ సినిమాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఐతే, ‘దేవర’ టీం మాత్రం ఈ పిక్స్ ను షేర్ చెయ్యొద్దు అని, షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొంది. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

Share This Article