పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా సినిమాల్లో డైరెక్టర్ మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’తో పాటు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ అనే సినిమాను తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ సర్కిల్స్‌లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పీరియాడిక్ లవ్ స్టోరీగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతుంది.
అయితే, ఈ సినిమాను హను రాఘవపూడి హ్యాండిల్ చేస్తున్న తీరుకి ప్రభాస్ చాలా ఇంప్రెస్ అయ్యాడంట. దీంతో ఈ సినిమాను పూర్తి చేయకముందే, హను రాఘవపూడితో మరో మూవీ చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ రెడీ కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఫౌజీ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.