మరోసారి తేదీ మారింది!

Saturday, January 18, 2025

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ , లెక్కల మాస్టర్‌ సుకుమార్ కాంబోలో ఘన విజయం సాధించిన పుష్ప సినిమాకు సీక్వెల్‌ గా వస్తున్న పుష్ప 2 పై భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడేళ్ళుగా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను ఎన్ని విధాలుగా చెక్కాలో అన్ని విధాలుగా చెక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో  విడుదల  కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా డిసెంబర్ విడుదలకు రెడీ అవుతుంది.

కాగా పుష్ప -2 విడుదల విషయంలో ఇప్పుడు టాలీవుడ్ లో రెండు తేదీలు వినపడుతున్నాయి. వాస్తవానికి పుష్ప -2 ను డిసెంబరు 6న విడుదల కావాల్సి ఉంది. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిచారు కూడా. కానీ ఇప్పుడు ఒకరోజు ముందు వస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారట మేకర్స్. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఓవర్సీస్ లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదల అవుతుండడంతో డిసెంబరు 5న పుష్ప వస్తే ఫస్ట్ వీక్ లో మెయిన్ థియేటర్స్ అందుబాటులో ఉండవు.

అదే ఓవర్సీస్ ప్రీమియర్స్ డిసెంబరు 4న వేస్తే వారం రోజుల పాటు పీఎల్‌ఎఫ్‌ ప్రదర్శనలను గట్టిగానే ప్లాన్‌ చేసుకోవచ్చు. తెలుగు స్టేట్స్ లో కూడా లాంగ్ రన్ దొరుకుతుంది. ఈ రెండు కాకుండా డిసెంబరు 20న వస్తే తెలుగు స్టేట్స్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అవుతుంది. కానీ ఓవర్సిస్ మార్కెట్ లో తీవ్ర పోటీ ఉంటుంది. ఐమాక్స్ వంటి స్క్రీన్స్ కూడా అందుబాటులో దొరకవు.

క్రిస్టమస్ అంటే బాలీవుడ్ లో కూడా స్టార్ హీరో సినిమాలు బాగానే విడుదల అవుతాయి. మరి ఫైనల్ గా ఈ డేట్ కు వస్తారో మరి కొద్దీ రోజులు ఆగితే కానీ తెలియదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles