మరోసారి గరం..గరం! నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఈ బ్యూటీ వరుసగా బ్లాక్‌బస్టర్ చిత్రాలు చేస్తుంది. ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతుండటంతో అమ్మడి క్రేజ్ పీక్స్‌కు చేరుకుంది. అయితే, ఇప్పుడు రష్మిక ఓ సరికొత్త వివాదంలో చిక్కుకుంది. రష్మిక మందన్న తన కెరీర్‌ని ‘కిర్రిక్ పార్టీ’ అనే కన్నడ చిత్రంతో మొదలుపెట్టింది.
ఆ తర్వాత పలు ఇతర భాషల్లో స్టార్‌డమ్ సాధించింది. అయితే, బెంగుళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు రష్మికను ఆహ్వానించగా, ఆమె దానికి నిరాకరించిందట. దీంతో కర్ణాటకలోని మాండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ తాజాగా రష్మిక పై ఫైర్ అయ్యారు. కన్నడ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక, కర్ణాటకలో జరుగుతున్న ఈవెంట్‌కు రావడానికి టైమ్ లేదని చెప్పడం సరికాదని.. గతంలోనూ తన ఇల్లు హైదరాబాద్‌లో ఉందని.. కర్ణాటక ఎక్కడ ఉందో తెలియదు అనే విధంగా ఆమె మాట్లాడిందని సదరు ఎమ్మెల్యే మండిపడ్డారు.
కన్నడ సినీ పరిశ్రమ, భాష పట్ల గౌరవం లేని విధంగా ప్రవర్తించిన రష్మికకు తగిన బుద్ధి చెప్పాలా వద్దా అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. దీంతో రష్మిక మందన్నపై కన్నడ ప్రజలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరి రష్మిక ఈ వివాదంపై స్పందిస్తుందేమో చూడాలి.