పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా తెరకెక్కిన సుజీత్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఓజి గురించి ప్రేక్షకులకి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. రిలీజ్ కి ముందే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా, ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తూ పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తోంది. మెగా హీరోలంతా కలిసి ప్రత్యేక స్క్రీనింగ్ లో ఈ సినిమా చూసిన విషయమే అభిమానుల్లో మరింత హైప్ ని పెంచింది.
ఇక ఓజి చూసే ప్రేక్షకులకి ఇప్పుడు మరో సర్ ప్రైజ్ రాబోతుందనే సమాచారం వస్తోంది. అందమైన నేహా శెట్టిపై చిత్రీకరించిన ఒక ప్రత్యేక గీతం ఈ రోజు నుంచే థియేటర్లలో ప్రదర్శించబడనుందని టాక్ వినిపిస్తోంది. అసలే ఆ పాటని నిన్న సోమవారం నుంచే ప్లాన్ చేసినప్పటికీ, క్యూబ్ కంటెంట్ అప్ లోడ్ లో కొద్దిగా ఆలస్యం కావడంతో అది ఈ రోజు నుంచే షోస్ లో కనిపించనుందని చెబుతున్నారు.
