పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఓజి. దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే రిలీజ్ కాకముందే ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, అమెరికా మార్కెట్ లో కూడా ఈ సినిమాకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఓపెనింగ్స్ విషయానికి వస్తే ఎలాంటి సందేహం లేకుండా రికార్డులు క్రియేట్ చేసే స్థాయిలో హైప్ ఏర్పడింది.
ఈ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ముందే ప్రకటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ఆడియన్స్ లో ఇప్పటికే ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. కానీ హిందీ, తమిళ మార్కెట్ లో కూడా అదే రేంజ్ రిజల్ట్ కావాలంటే అక్కడి ప్రమోషన్స్ ను మరింత బలంగా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆ భాషలకి చెందిన నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు కాబట్టి ఆ అడ్వాంటేజ్ ను సరిగ్గా ఉపయోగించుకోవాలి.
