పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమాకు భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రిలీజ్ కు కొన్ని రోజులే మిగిలినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ఉద్రిక్తత స్పష్టంగా ఉంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ గురించి ఇప్పటివరకు స్పష్టమైన అప్‌డేట్స్ రాకపోవడం, సినిమాకు ప్రధానంగా తెలుగు ఆడియెన్స్ కోసం మాత్రమే ఫోకస్ వున్నట్లు సూచిస్తుంది.
ట్రైలర్, పోస్టర్స్ లో కూడా ఇతర భాషల గురించి ఎలాంటి వివరాలు లేకపోవడం వల్ల, ఈ చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయ్యిందని చెప్పవచ్చు.
