ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడిన రెండు పాన్ ఇండియా చిత్రాలు సినిమాప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న “కూలీ” సినిమా ఇప్పటికే యూఎస్ మార్కెట్ లో బుకింగ్స్ హవా సృష్టిస్తున్నట్టు సమాచారం. ఆగస్ట్ 13న ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్ షోలు జరగనున్నాయి.
ఇదే సమయంలో మరో క్రేజీ మూవీ అయిన పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజి” గురించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకి వచ్చింది. ప్రస్తుతం యూఎస్ లో విడుదల కాబోతున్న కూలీ ప్రింట్‌తో పాటు ఓజీకి సంబంధించిన గ్లింప్స్‌ను కూడా థియేటర్లలో ప్రదర్శించనున్నట్టు టాక్. అంటే ఒకేసారి రెండు సినిమాల పాన్ ఇండియా ప్రమోషన్ కూడా ఊపందుకుంటున్నట్టే.
ఇదిలా ఉంటే, ఓజీ సినిమాకు సంబంధించిన మొదటి సింగిల్ గురించి కూడా ఇటీవలే చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు భారీ స్థాయిలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది డబుల్ ఫెస్టివల్ లాంటిదే అని చెప్పొచ్చు. ఒకవైపు థియేటర్ లో గ్లింప్స్, మరోవైపు మ్యూజికల్ ట్రీట్ కోసం ఎదురుచూపులు పెరిగిపోతున్నాయి.
