విష్ణు మంచు నటిస్తున్న ‘కన్నప్ప’ నుంచి తాజాగా విడుదలైన ‘శివా శివా శంకరా’ అనే పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఈ శివరాత్రికి అన్ని చోట్లా ఈ పాటే మార్మోగిపోయేలా ఉంది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ పాటను 80 మిలియన్ల(8 కోట్ల) మంది చూశారు. ఇక ఇన్‌స్టాగ్రాంలో రెండు లక్షలకు పైగా రీల్స్ చేశారు.
మహా శివరాత్రి సందర్భంగా ఈ పాట మరింతగా ట్రెండ్ అవుతోంది. ఈ పాట అద్భుతమైన విజయం సాధించడం గురించి నటుడు-నిర్మాత విష్ణు మంచు మాట్లాడారు. ’శివా శివా శంకరా’ పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి మేం చాలా ఆనందపడుతున్నాం. ప్రజలు దానిని స్వీకరించిన విధానం, రీల్స్ చేస్తూ తమ తమ భక్తిని ప్రదర్శిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంతలా ఈ పాట ట్రెండ్ అవుతుందని మేం ఊహించలేదు. శివరాత్రి వస్తున్నందున ఈ పాట మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అర్థం అవుతోంది’ అని అన్నారు.