టాలీవుడ్‌లో ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చుట్టూ బజ్ రోజురోజుకీ పెరుగుతోంది. పవన్ మళ్లీ బాక్సాఫీస్ దగ్గర మాస్ మ్యానియా చూపించబోతున్నాడన్న నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా సాగుతున్న సమయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పవన్ లుక్ స్పెషల్ హైలైట్ అయ్యింది. స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఆయన కనిపించడం చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ లుక్ చూస్తే, ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకోసం ఇలా మారిపోయినట్టు స్పష్టమవుతోంది. అందుకే ఈ గెటప్‌కి కారణమైన దర్శకుడు హరీష్ శంకర్‌ను అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
వారు పోస్టులు పెడుతూ హరీష్ శంకర్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు. పవన్‌ని ఇంత స్టైలిష్‌గా చూపించడానికి కారణం ఆయననే అని చెబుతున్నారు. హరీష్ కూడా స్పందిస్తూ పవన్ కోసం ఏమైనా చేయడానికి రెడీ అని తన అభిమానం చూపించారు.
ఇదిలా ఉండగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఒకవైపు హరిహర వీరమల్లు థియేటర్లకు రెడీ అవుతుండగా, మరోవైపు భగత్ సింగ్ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు సినిమాలపై కూడా అభిమానుల లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది.
