కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘ది రాజా సాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, గతంలో ఈ భామ ప్రభాస్ గురించి, ప్రభాస్ మంచితనం గురించి, ముఖ్యంగా ప్రభాస్ తన కోసం షూటింగ్ కు పంపించే భోజనం గురించి చాలా పాజిటివ్ కామెంట్లు చేసింది.
తాజాగా మాళవిక మోహనన్ మళ్లీ ప్రభాస్ గురించి మాట్లాడుతూ మరోసారి క్రేజీ కామెంట్లు చేసింది. ఇంతకీ, మాళవిక మోహనన్ ఏం మాట్లాడింది అంటే.. ‘ప్రభాస్ తో కలిసి నటించడం నా అదృష్టం. ఒకవిధంగా నా జీవితంలోనే ప్రభాస్ తో కలిసి సినిమా చేయడం నాకు ఓ అదృష్టపు మైలు రాయి’ అంటూ మాళవిక మోహనన్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట షికారు చేస్తున్నాయి.
మాళవిక మోహనన్ తమిళంలో వరుసగా సినిమాలు చేసింది. రజినీకాంత్, దళపతి విజయ్, ధనుష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టనుంది.