టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా విడుదలైన వెంటనే ప్రేక్షకుల్లో సంచలనం సృష్టిస్తోంది. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజునే రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు నమోదు చేస్తోంది.
తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం సీడెడ్ ఏరియాలోనే ఈ చిత్రం 10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. జీఎస్టీతో కలిపి మొత్తం 10.3 కోట్ల వరకు రాబట్టిందని లెక్కలు చెబుతున్నాయి. పవన్ కెరీర్‌లో ఇది మరో శక్తివంతమైన రికార్డ్‌గా నిలిచింది అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతాన్ని థమన్ అందించగా, హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటించింది. అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ భారీ సినిమాను నిర్మించింది.
