పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజి” ప్రేక్షకులను ఊరించే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అభిమానిగా ఉన్న సుజీత్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించగా, ఆయన స్టైల్‌లో తీసిన మాస్ యాక్షన్ సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ అయిన వెంటనే భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్లిన ఈ సినిమా ఇప్పుడు విదేశీ మార్కెట్‌లో కూడా రికార్డులు సృష్టిస్తోంది.
అమెరికాలో ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లోనే బలమైన కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే 4 మిలియన్ డాలర్ల దాకా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, 4.2 మిలియన్లను దాటేసి తదుపరి 4.5 మిలియన్ వైపు దూసుకెళ్తోంది. ఇక వీకెండ్ కలెక్షన్లతో 5 మిలియన్ క్లబ్‌లోకి కూడా చేరిపోతుందా అనే ఆసక్తి పెరిగింది.
థమన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అవ్వగా, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, జాకీ ష్రాఫ్ లాంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.
