ఓ క్లారిటీ ఇచ్చిన థమన్‌!

Saturday, January 18, 2025

ఐకాన్ స్టార్, జాతీయ నటుడు అల్లు అర్జున్ హీరోగా రష్మికా  హీరోయిన్ గా డైరెక్టర్ సుకుమార్ తీర్చిదిద్దుతున్న భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప 2 ది రూల్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఒకో పనిని ఇపుడు పూర్తి చేస్తూ ముందుకు తీసుళ్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు కోసం థమన్ రంగంలోకి దిగుతున్నట్లు వచ్చిన వార్తలపై థమన్ కూడా కన్ఫర్మ్ చేసేశాడు. అయితే తాజాగా దీనిపై థమన్ మరో స్టేట్మెంట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నాడు. తాను పుష్ప 2 లో కేవలం చిన్న భాగం మాత్రమే అని సినిమా మొత్తానికి నేను పని చెయ్యలేదు అంటూ ఓ సంచలన ప్రకటన అయితే చేశాడు. దీనితో దేవిశ్రీ ప్రసాద్ ఉన్నప్పటికీ తనని తీసుకోవడంపై వచ్చిన కామెంట్స్ కి ఇది వివరణలా అనిపిస్తుంది అని చెప్పాలి. మరి ఈ అవైటెడ్ సీక్వెల్ కి ఎలాంటి స్కోర్ ని థమన్ ఇస్తాడో చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles