ఓ క్లారిటీ ఇచ్చిన జక్క

Thursday, September 26, 2024

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబో లో ఓ  భారీ సినిమాని  చేయనున్నారనే సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రాబోతున్న సంగతి తెలిసిందే.  మరి రాజమౌళితో ఎప్పుడు నుంచో అనుకుంటున్న ఈ మూవీ ఎట్టకేలకి సెట్ అయ్యి పాన్ వరల్డ్ లెవెల్ హైప్ ని సెట్ చేసుకుంది.

అయితే ఈ సినిమా ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం అభిమానులకి ఏ క్లారిటీ లేదు. ఇంకో పక్క మహేష్ బాబు సరికొత్త మేకోవర్ అయితే ఫ్యాన్స్ కి కనుల పండుగలా ఉంది. అయితే ఈ సినిమా విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ కూడా వినపడుతుంది. దీని ప్రకారం ఈ ప్రాజెక్ట్ నటీ నటుల ఎంపిక ఏంటి అనేది మొత్తం క్లియర్‌ అయ్యిందంట.

మహేష్ సహా సినిమాలో కనిపించే నటీనటుల లిస్ట్ ని జక్కన్న ఫైనల్ చేసేరని తెలుస్తుంది. ఇలా ప్రతి అంశంలో రాజమౌళి అయితే పక్కా క్లారిటీగా సినిమా పనులు చేసేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాలో వరల్డ్ వైడ్ గా చాలా మంది ప్రముఖుల పేర్లే వినిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles