జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ సినిమా మీద అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ‘వార్ 2’ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ‘ఎన్టీఆర్–నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతుంది. యాక్షన్, థ్రిల్లర్ జోనర్‌లో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే ఈ సినిమాలో మలయాళ నటుడు టొవినో థామస్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ వార్తలు నిజమని పరోక్షంగా ధృవీకరించారు మరో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఆయన వెల్లడించిన విషయాల ప్రకారం– ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ చాలా బలమైన కథను సిద్ధం చేశారట. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు మరిన్ని ప్రధాన పాత్రలు కూడా ఉంటాయని చెప్పారు.
ఇవే కాకుండా, టొవినో థామస్‌తో పాటు బిజు మీనన్ అనే మరో మలయాళ నటుడు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని ఆయన తెలిపారు. అంటే ఇది పాన్ ఇండియా స్కేల్‌లో రూపొందుతున్న ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అన్నమాట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టొవినో థామస్ మాత్రం తన టాలీవుడ్ డెబ్యూ సినిమాగా ఎన్టీఆర్ సినిమాను ఎంచుకోవడం విశేషం. మరి ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.
