ఎన్టీఆర్ నా స్నేహితుడు కాదు: రాజమౌళి!

Wednesday, January 22, 2025

ఎన్టీఆర్‌ , రాజమౌళి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జక్కన్న మొదటి సినిమా సినిమా స్టూడెంట్‌ నంబర్‌ వన్‌ తారక్‌ తో తీసి పెద్ద హిట్‌ అందుకున్నారు. ఆ తరువాత వీరిద్దరి కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. జక్కన్న తన రెండో సినిమా కూడా తారక్‌ తోనే తీశాడన్న విషయం తెలిసిందే.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో యమదొంగ,  రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. అయితే రాజమౌళి తన ప్రతి ఇంటర్వ్యూ లో తనకు ఎంతో ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అని చెప్పేవారు. నేను ఏ హీరోతో సినిమా చేసిన కూడా ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ,నిర్మాతకు మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటాను. కానీ తారక్ తో సినిమా చేసేటప్పుడు ఆ సినిమా ఎన్టీఆర్‌ కు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తుంటాను అని రాజమౌళి చాలా సార్లు చెప్పారు.

దీనితో వీరి బాండింగ్ చూసి ఎన్టీఆర్ ,రాజమౌళి మంచి స్నేహితులు అని అంతా భావించారు.అయితే తాజాగా ఎన్టీఆర్ నా మిత్రుడు కాదని రాజమౌళి చెప్పడం చర్చకు దారి తీసింది. రీసెంట్ గా కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాజమౌళిని ఇండస్ట్రీలో మీకున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని అడగగా అక్కడ వున్న ప్రేక్షకులు అంతా ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.

దానికి రాజమౌళి స్పందిస్తూ ఎన్టీఆర్ నాకు స్నేహితుడు కాదు నా తమ్ముడు లాంటి వాడు అని తెలిపాడు .నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బాహుబలి నిర్మాతలు  శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి అని వివరించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles