కాంతారా 1 లో ఎన్టీఆర్‌?

Tuesday, January 21, 2025

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్నమోస్ట్‌  అవైటెడ్ భారీ సినిమా “దేవర” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పాటుగా తారక్‌ మరో భారీ సినిమా వార్ 2. అంతేకాకుండా సెన్సేషనల్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా కూడా చేయనున్న సంగతి తెలిసిందే. ఇలా క్రేజీ లైనప్ తో ఉన్న తారక్ ఇప్పుడు చిన్న గ్యాప్‌ తీసుకొని కర్ణాటకలో కుటుంబంతో కలిసి పర్యటిస్తున్నాడు.

అక్కడ స్టార్ హీరో రిషబ్ శెట్టితో కలిసి కనిపిస్తున్న తారక్ పై అక్కడి మీడియాలో పలు ఇంట్రెస్టింగ్‌ ప్రశ్నలు ఎదురయ్యాయి. రిషబ్ చేస్తున్న కాంతార 1 లో మీరు కూడా నటిస్తున్నారా అనే ప్రశ్నకి తారక్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీనిపై తారక్ మాట్లాడుతూ రిషబ్ ప్లాన్ చేస్తే అందుకు నేను సిద్ధమే అంటూ జవాబిచ్చాడు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి నిజంగానే తారక్ ఈ భారీ సినిమాలో కనిపిస్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి అజనీష్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles