అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్‌…ఫ్యాన్స్‌ ఫిదా!

Andhrawatch
1 Min Read

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రానికి వచ్చాడు. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తారక్‌ తన తల్లి, భార్యతో కలిసి ఓటింగ్‌ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. ఈ క్రమంలోనే పోలింగ్‌ కేంద్రం వద్ద ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

ఎన్టీఆర్ తన అభిమాని కోరికను తీర్చాడు. అందుకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారుతుంది. అది ఏంటంటే.. ఎన్టీఆర్‌ కచ్చితంగా తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ క్రమంలోనే ఈరోజు కూడా ఆయన ఓటు వేసేందుకు పోలింగ్‌ సెంటర్‌ వద్దకు చేరుకున్నారు. ఓటు వేసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడి వెనుదిరిగారు.

అలా వెళ్ళేటప్పుడు ఓ అభిమాని అన్నా ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడిగాడు. వెంటనే ఎన్టీఆర్ అతని గుండెల పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.. ఆ సమయంలో అక్కడున్న మీడియా కంటికి ఈ విషయం చిక్కింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో ఆయన ఫ్యాన్స్ ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Share This Article