టాలీవుడ్ లో పవర్‌ఫుల్ వాయిస్ అంటే గుర్తొచ్చే పేర్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన గొంతులో ఉండే ఎనర్జీ, ఇమోషన్ ఏ వీడియోకైనా కొత్త లెవెల్ లో బజ్ తీసుకొస్తాయి. అందుకే ఆయన వాయిస్ ఓవర్ వస్తేనే అభిమానుల్లో ఎక్సైట్మెంట్ మొదలవుతుంది. గతంలోనే విజయ్ దేవరకొండ సినిమా “కింగ్డమ్” కోసం తారక్ తన వాయిస్ తో నేరేషన్ ఇచ్చినప్పుడు ఆ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు మళ్లీ అలాంటి సిట్యుయేషన్ రిపీట్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, “సామ్రాజ్యం” అనే కొత్త సినిమాలో తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గతంలో “కింగ్డమ్” సినిమాకి కూడా “సామ్రాజ్యం” అనే టైటిల్‌ను పరిశీలించారు. అంతేకాదు, హిందీ వెర్షన్‌ను “సామ్రాజ్య” పేరుతో విడుదల చేశారు. ఇప్పుడు మళ్లీ అదే పేరు, అదే తారక్ పేరు చుట్టూ తిరుగుతుండటం ఒక ఇంట్రెస్టింగ్ కాయిన్సిడెన్స్ గా మారింది.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ “సామ్రాజ్యం” సినిమా తెలుగులో ఒరిజినల్ ప్రాజెక్ట్ కాదు. ఇది కొలీవుడ్ సెన్సేషన్ వెట్రిమారన్ దర్శకత్వంలో, హీరో శింబు నటిస్తున్న “అర్సన్” సినిమాకి తెలుగు వెర్షన్. ఈ ప్రాజెక్ట్‌కి మంచి క్రేజ్ ఉంది. ఇక తారక్ వాయిస్ ఓవర్‌తో రాబోతున్న ఈ తెలుగు ప్రోమోను అక్టోబర్ 17వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారని సమాచారం.
