మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా దేవర. తారక్ నుంచి అరవింద సమేత తర్వాత వచ్చిన సోలో సినిమా ఇది కాగా ఎన్టీఆర్ కెరీర్లో రికార్డు గ్రాసర్ గా ఈ మూవీ చరిత్ర సృష్టించింది. ఇలా బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ భారీ సినిమాని మేకర్స్ రీసెంట్ గానే జపాన్ దేశంలో రిలీజ్ కి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాకి ఉన్న సీక్వెల్ దేవర పార్ట్ 2 పై జపాన్ లో ఎన్టీఆర్ ఇచ్చిన అప్డేట్ వైరల్ అవుతుంది. తాను దేవర 2 కోసం మాట్లాడుతూ ఇపుడు దేవర 2 చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది అని ఇది చాలా పెద్ద కథ పార్ట్ 1 లో దేవర కోసం చాలా నేర్చుకున్నారు. ఈసారి పార్ట్ 2లో మాత్రం వర కోసం ఎక్కువ తెలుసుకుంటారు అలాగే అసలు దేవర కి ఏమైంది అనే బ్యాక్ స్టోరీకి సమాధానం దే’వర’ 2 లో దొరుకుతుంది అంటూ తారక్ సాలిడ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ అవైటెడ్ సీక్వెల్ ని మేకర్స్ ఈ ఏడాదిలోనే మొదలు పెట్టబోతున్నారు.