ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ డ్రాగన్ చుట్టూ ఊహలు, అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోందన్న విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. మరి ఈ జంటను ఒకే వేదికపై చూడబోతున్నారన్న వార్త ఇప్పుడు అభిమానుల్లో మరింత హంగామా రేపుతోంది.
సెప్టెంబర్ 28న రిషబ్ శెట్టి కాంతార 1 ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్‌కి ప్రత్యేక అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో హీరోయిన్ కూడా రుక్మిణి కావడంతో, ఇద్దరూ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. దీంతో సహజంగానే డ్రాగన్ సినిమా గురించి చిన్న టీజర్లు లేదా సూచనలు బయటకు రావొచ్చని అభిమానులు గట్టిగా ఎదురు చూస్తున్నారు.
డ్రాగన్‌కి సంగీతం రవీ బసృర్ అందిస్తున్నారు. ఇక కాంతార సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న భారీ స్థాయిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
