టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో ది మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB29 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను చిత్రీకరించుకుంటున్నారు.
అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తుంది. ఈ సినిమాలో ‘రుద్ర’ అనే పేరు ప్రత్యేకంగా నిలవనుందని తెలుస్తోంది. అయితే, ఇది సినిమా టైటిల్ కాదని.. ఈ సినిమాలో హీరో పేరుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మహేష్ పాత్రకు ఇలాంటి పవర్‌ఫుల్ పేరు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.
ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుంది. వెర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.