ఆ ముద్దుగుమ్మ కాదు..ఈ అందాల భామ!

Wednesday, January 22, 2025

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్‌తో రూపొందిస్తున్నాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డుల వేటను ఈ చిత్రంతో కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ‘పుష్ప-2’ మూవీలో ఐటెం సాంగ్ కోసం చాలా మంది పేర్లే వినపడ్డాయి. అయితే, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈ సాంగ్‌లో కనిపించనుందనే వార్త దాదాపు ఖరారయ్యింది. కానీ, ఇప్పుడు శ్రద్ధా ప్లేస్‌లో వేరొక యంగ్ బ్యూటీ పేరు వినిపిస్తోంది.

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పుష్ప-2’ మూవీలో స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్‌ చేయబోతుందనే టాక్ చక్కర్లు కొడుతోంది. దీంతో ఒక్కసారిగా అందరూ ఈ సాంగ్ ఎలా ఉండబోతుందా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బన్నీతో శ్రీలీల డ్యాన్స్ చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటుందని వారు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. మరి నిజంగానే శ్రీలీల ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందా.. లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles