దాంతో కాదు…ఈ సినిమాతో వార్నర్ ఎంట్రీ!

Saturday, January 18, 2025

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా నేషనల్ వైడ్ గా మాత్రమే కాకుండా గ్లోబల్ వైడ్ గా కూడా మంచి రీచ్ ని సొంతం చేసుకుంది. . అలాగే పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్ స్టెప్పులు కానీ తగ్గేదేలే మ్యానరిజం కానీ బాగా క్లిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా వీటితోనే ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ అప్పట్లో కోవిడ్ సమయంలో చేసి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించాడు.

అలాగే అల్లు అర్జున్ బుట్ట బొమ్మ స్టెప్పయితే ఐపీఎల్ లో కూడా చాలా సార్లు వేసి మన తెలుగు ఆడియెన్స్ కి కూడా ఎంతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలో చాలా మంది డేవిడ్ వార్నర్ ని తెలుగు సినిమాలో చూడాలని కూడా కోరుకున్నారు. అయితే రీసెంట్ గా డేవిడ్ వార్నర్ పై ఓ షాకింగ్ పిక్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

పుష్ప లో అల్లు అర్జున్ గెటప్ లో వార్నర్ దర్శనం ఇచ్చాడు. అయితే ఇది పుష్ప 2 లోనిదే అంటూ పలు వార్తలు బయటకి వచ్చాయి కానీ ఇప్పుడు దీనిపై అసలు క్లారిటీ వచ్చేసింది. దీంతో డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో నటించడం నిజమే అట కానీ అది పుష్ప 2 లో కాదు నితిన్ చేస్తున్న రాబిన్ హుడ్ లో అట.

ఇది మాత్రం షాకింగ్‌ విషయమనే  చెప్పాలి. దర్శకుడు వెంకీ కుడుముల లేటెస్ట్ గా ఆస్ట్రేలియాలో చేసిన షెడ్యూల్ లో అయితే వార్నర్ నటించాడట.దీంతో పుష్ప 2 లో కాదు రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్ ఉన్నాడని తెలిసిపోయింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles