అంతలా కాదులేండి!

Wednesday, April 2, 2025

బాలీవుడ్ సినిమా దగ్గర భారీ వసూళ్లతో రికార్డులు సెట్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం “ఛావా” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ అలాగే రష్మిక మందన్నాతో ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ఈ చిత్రం హిందిలో రిలీజ్ అయ్యిన తర్వాత తెలుగు ఆడియెన్స్ నుంచి భారీ డిమాండ్ ఏర్పర్చుకుంది.

ఈ మేర గీతా ఆర్ట్స్ వారు తెలుగు డబ్బింగ్ కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే తెలుగులో ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేసాక ఒకింత మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. మెయిన్ గా విక్కీ కౌశల్ కి డబ్బింగ్ పరంగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. తనకి తెలుగు డబ్బింగ్ వాయిస్ సెట్ కాలేదని ఆడియెన్స్ అంటున్నారు.

దీనితో ఛావా తెలుగులో డబ్బింగ్ చేసి తీసుకొస్తున్నప్పటికీ ఇలాంటి అంశాల్లో ఇంకా కేర్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పాలి. మరి లాస్ట్ టైం “అనిమల్” సినిమాకి కూడా టీజర్ లో ఒక డబ్బింగ్ సినిమాలో ఒక డబ్బింగ్ తో తీసుకొచ్చారు అది వర్క్ అయ్యింది. మరి “ఛావా”కి ఇలాంటి మార్పులు ఉంటాయో లేక ఇలానే వస్తుందా అనేది చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles