డైరెక్షనే కాదు..డ్యాన్స్ లోనూ పర్‌ఫెక్ట్‌ నే!

Thursday, April 3, 2025

సినిమాల్లో ఎంత డెడికేషన్‌ గా ఉంటారో… ప్రతి పనిలోనూ అలానే ఉంటారు డైరెక్టర్‌ రాజమౌళి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయన ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా కేటాయిస్తాడు. ఆయన కొద్ది రోజుల క్రితం ఓ ఫంక్షన్‌ లో భార్య రమతో కలిసి ప్రభుదేవా ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే… అనే పాటకు డ్యాన్స్‌ చేసిన విషయం తెలిసిందే.

ఆ వీడియో నెట్టింట్లో ఎంత వైరల్‌ గా మారిందో… అది చూసిన వారంతా కూడా జక్కన్నలో ఈ యాంగిల్‌ కూడా ఉందా అంటూ కామెంట్లు పెట్టడం కూడా జరిగింది. తాజాగా ఆ డ్యాన్స్‌ కు సంబంధించిన రిహార్సెల్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది.

రాజమౌళి-రమ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అందులో రాజమౌళి స్టెప్పులకు ఫ్యాన్స్  ఫిదా అవుతున్నారు. ప్రాక్టీస్‌లో కూడా పెర్‌ఫెక్షన్  చూపించారు రాజమౌళి. ‘డైరెక్షన్ లోనే కాదు డాన్స్ లోనూ  మీరు మాస్టరే సార్‌’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles