టీజర్‌ వచ్చేందుకు ఎంతో సమయం లేదు!

Friday, September 20, 2024

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అంజలి అలాగే కియారా అద్వానీలు హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు కానీ ఫైనల్ గా ఇప్పుడిప్పుడే కొంచెం పాజిటివ్ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి.

రీసెంట్ గానే నిర్మాణ సంస్థ కూడా పలు అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుండగా లేటెస్ట్ గా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇప్పుడు తెలుస్తుంది.దీనితో ఈ భారీ సినిమా టీజర్ వచ్చే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేటి నుంచే గేమ్ ఛేంజర్ డబ్బింగ్ పనులు మొదలు పెట్టినట్టుగా ఇప్పుడు సమాచారం. దీనితో టీజర్ వచ్చేందుకు ఇప్పుడు సమయం ఎంతో దూరంలో లేదనే చెప్పుకోవాలి. అలాగే డబ్బింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి.

కాబట్టి ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా ఈ ఏడాది రిలీజ్ కే తీసుకొచ్చే పనులు కూడా మొదలైపోయినట్టే అని చెప్పాలి. మొత్తానికి అయితే మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్న ఆ అవైటెడ్ ట్రీట్ ఇప్పుడు ఎంతో దూరంలో లేదనే అనుకోవాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles