కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న “కూలీ” సినిమా ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. రజినీకాంత్‌తో పాటు కింగ్ నాగార్జున, ఉపేంద్ర లాంటి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న స్టార్స్ ఈ సినిమాతో జతకట్టడం వల్లే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రైట్స్ దాదాపు 50 కోట్ల వరకు వెళ్లాయని సమాచారం. ఇక తమిళనాట అయితే మేకర్స్ ఏకంగా 110 కోట్ల రేంజ్ లో డీల్స్ కోసం చర్చలు జరుపుతున్నట్టు ఇండస్ట్రీ టాక్. దీనితో ఈ సినిమాకి మార్కెట్ లో డిమాండ్ ఎంతగా ఉందో అర్థం అవుతోంది.
ఇంకా సినిమాకు సంగీతం అందిస్తున్నాడు అనిరుద్ రవిచందర్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అన్నీ దాదాపు కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో “కూలీ” ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ విడుదలతో రజినీకాంత్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చూపనున్నాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
