అందులో కాదు మరో దానిలో!

Monday, October 21, 2024

కన్నడ సినిమా దగ్గర సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు అలాగే డైరెక్టర్డు రిషబ్ శెట్టి తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “కాంతార” కూడా ఒకటి. అయితే ఇపుడు దీనికి ప్రీక్వెల్ లో తాను ఫుల్‌ బిజీగా ఉండగా ఈ సినిమా సహా రిషబ్ టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నట్టుగా తెలిసింది.

టాలెంటెడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మోస్ట్‌ అవైటెడ్ సూపర్ హీరో సీక్వెల్ చిత్రం “జై హనుమాన్” లో రిషబ్ ఉంటాడు అనే వార్తలు బాగా వినిపించాయి. అయితే తెలుగులో ఈ సినిమా కాకుండా మరో సినిమా ని ఓకే చేసినట్టుగా తెలుస్తుంది.

ఇది కూడా ఓ ప్రముఖ బ్యానర్ లో అన్నట్టుగా టాక్. ఇలా తెలుగులో అయితే మొత్తం రెండు సినిమాలు వరుసగా రిషబ్ చేతిలో ఉన్నాయని తెలుస్తుంది. మరి జై హనుమాన్ కాకుండా మరో సినిమా ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles