డబ్బులు ఇవ్వడం లేదు..కానీ వాడుకుంటున్నారు..

Sunday, December 22, 2024

టాలీవుడ్‌ యంగ్‌ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌ పుత్‌ ఈ మధ్య సినిమాల స్పీడ్‌ పెంచేసింది. ఓ పక్క సోషల్‌ మీడియాలో గ్లామర్‌ షో చేస్తూనే మరో పక్క వరుస సినిమాలు చచేసేందుకు రెడీ అయ్యింది.  గతేడాది మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ఆ సినిమా సూపర్  హిట్ అయ్యింది. అంతేకాదు ఆ సినిమాలో పాయల్ నటన కు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రక్షణ’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా జూన్ 7న థియేటర్లలోకి రానున్నట్లు వెల్లడించారు.

 కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడుతున్నట్లు తెలుస్తుంది.. తాజాగా ఈ విషయాన్ని పాయల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది..అందుకు కారణాలు ఉన్నాయని తెలుస్తుంది.. డబ్బులివ్వకుండా పాయల్ ను మోసం చేస్తున్నారని ఇంస్టాగ్రామ్ లో ఆరోపిస్తూ పోస్ట్ చేసింది.. పాయల్.. ఇందులో నిజమేంటో తెలియాలంటే మరో అప్డేట్ వచ్చేవరకు ఆగాల్సిందే.

మంగళవారం సినిమా పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా అని తెలుస్తోంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆద్యంతం కట్టిపడేయనున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది పాయల్.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles