సరిపోదా శనివారం నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చిన మేకర్స్‌!

Saturday, December 21, 2024

సరిపోదా శనివారం నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చిన మేకర్స్‌!

నేచురల్‌ స్టార్‌ నాని వరుస సినిమాలు చేస్తూ హిట్లు అందుకుంటున్నాడు. నాని న‌టిస్తున్న తాజా చిత్రం ‘స‌రిపోదా శనివారం’ నుండి మ‌రో సాలిడ్ అప్డేట్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్ప‌టికే ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో అదిరిపోయే అంచనాలు పెరిగిపోగా, ఇప్పుడు ఈ సినిమా నుండి టీజ‌ర్ ను విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతున్నారు.

ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తున్న ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన్ మూవీ టీజ‌ర్ పై చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. ‘స‌రిపోదా శ‌నివారం’ నుండి టీజ‌ర్ ను జులై 20న విడుదల చేస్తున్న‌ట్లు ప్రకటించారు. ‘ర‌న్.. హి ఈజ్ క‌మింగ్ ఆన్ జులై 20’ అంటూ మేక‌ర్స్ ఈ టీజ‌ర్ గురించిన అప్డేట్ ను ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఈ టీజ‌ర్ పై క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది.

ఇక నాని ప‌వ‌ర్ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో అందాల భామ ప్రియా మోహ‌న్ హీరోయిన్ గా చేస్తోంది. ఎస్.జె.సూర్య విల‌న్ గా న‌టిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఆగ‌స్టు 29న విడుదల చేస్తున్న‌ట్లు చిత్ర నిర్మాత డివివి దాన‌య్య ఇప్ప‌టికే ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles