మాస్‌ బ్లాక్‌ బస్టర్‌ వైబ్స్‌ ఇస్తున్న సరిపోదా శనివారం టీజర్‌!

Saturday, January 18, 2025

నేచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తో రెండోసారి జత కట్టి చేస్తున్న తాజా చిత్రమే “సరిపోదా శనివారం”. దర్శకుడు వివేక్ ఆత్రేయతో కూడా నాని చేస్తున్న రెండో సినిమా కూడా ఇదే కావడంతో సినిమా పై సాలిడ్ హైప్ వచ్చేసింది. అయితే ఈ చిత్రం నుంచి మూవీ మేకర్స్ నేడు వెర్సటైల్ నటుడు ఎస్ జె సూర్య పై బర్త్ డే కానుకగా సాలిడ్ టీజర్ ని విడుదల చేశారు.

తాజాగా  ఈ టీజర్ మాత్రం క్రేజీ లెవెల్లో ఉందని చెప్పాలి. నాని హిందీ డైలాగ్ తో ఒక బ్యాడ్ కాప్ గా కనిపిస్తున్నా ఎస్ జే సూర్య ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ ఇద్దరికీ సినిమాలో వైరం ఏ రేంజ్ లో కనపడనుందో అలా వేరే లెవల్లో  అయితే చూపించేసారు. ఇక ఇందులో ఎస్ జే సూర్య తన మార్క్ ఈవిల్ నెస్ ని చూపించడం బిగ్ హైలైట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. మరి అలాంటి పాత్రని ఢీ కొట్టే వాడిగా నాని మంచి డైనమిక్ పాత్రలో  ఈ టీజర్ లో కనిపించి మెప్పించాడు.

ఇంకా ఈ టీజర్ లో జేక్స్ బిజోయ్ స్కోర్ మరింత ఎలివేట్ చేస్తూ మాస్ ట్రీట్ ని అభిమానులకు అందించింది. ఇలా మొత్తంగా అయితే సరిపోదా శనివారం టీజర్ తో మేకర్స్ ఒక మాస్ బ్లాక్ బస్టర్ ట్రీట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చిందని చెప్పుకొవచ్చు.
 ఇక ఈ మోస్ట్‌ అవైటెడ్ సినిమా ఈ ఆగస్ట్ 29న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles