బాలేదని ఎవరూ చెప్పారు!

Wednesday, January 22, 2025

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి లేటెస్ట్ కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ సినిమా స్వాగ్‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని తెరకెక్కించారు. అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సక్సెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు బాగున్నాయి అనిపిస్తాయి. ఇంకొన్ని సినిమాలు అంత లేదులే అన్నట్లు ఉంటాయి.  సినిమా చూసినోళ్లు 90% సాటిస్ఫై అయ్యారు. 10% కొంచెం కాంప్లెక్స్ ఉంది అని అనుకుంటున్నారు. శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు.

దానికి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను.  ఏమీ లేని నాకు ఇంత గుర్తింపు ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ రుణం కచ్చితంగా తీర్చుకోవాలి. హసిత్ నా అభిమాని. నాకు ఒక తమ్ముడిలా. ఆడియన్స్ నేను చేసిన ప్రతి క్యారెక్టర్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి రాస్తే దీన్ని కొట్టేది రాయాలి. రాస్తాడనే నమ్మకం కూడా ఉంది.

విశ్వ గారు మాకు ఇంత ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇలాంటి కథను మేము చేయలేం.  సినిమాని జనాల్లోకి తీసుకెళ్లి మీడియా మిత్రులు అందరికీ థాంక్యూ. ఆ 10% కూడా కంగారు పడకండి. నెక్స్ట్ సినిమాకి వడ్డీతో సహా ఇచ్చేస్తాను. లేకపోతే లావు అయిపోతాను (నవ్వుతూ) అందరికీ థాంక్యూ’ అని విష్ణు చెప్పుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles