నో బర్త్‌ డే ట్రీట్‌!

Thursday, December 4, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్లు, వీడియోలు ఇలా అన్ని ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంతో ప్రభాస్ మళ్లీ థియేటర్లలో గందరగోళం సృష్టించబోతున్నాడని యూనిట్ నమ్మకంగా చెబుతోంది.

ప్రభాస్ పుట్టినరోజు సమీపిస్తుండటంతో ఆయన అభిమానులు ఏదైనా స్పెషల్ అప్‌డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మొదట్లో ఊహించినట్టుగా రాజాసాబ్ నుంచి ఓ పాట రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగిందిగానీ, ఇప్పుడు ఆ వార్తకు చెక్ పడింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి సాంగ్ రిలీజ్ చేయడం లేదని మేకర్స్ స్పష్టంచేశారు.

అయినా కూడా అభిమానుల ఆశలు అంతగా తగ్గలేదు. కనీసం ఓ కొత్త పోస్టర్ లేదా గ్లింప్స్ ఇవ్వొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే డార్లింగ్ ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నారు.

ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles