అమరన్ తో నితిన్‌!

Thursday, September 12, 2024

ప్రస్తుతం మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా “వకీల్ సాబ్” మూవీ డైరెక్టర్‌ వేణు శ్రీరామ్ తో “తమ్ముడు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మంచి బజ్ కూడా ఏర్పడింది. అయితే నితిన్ ఒక్క హీరోగానే కాకుండా తమ ప్రొడక్షన్ హౌస్ నుంచి పలు సినిమాలు నిర్మాణం ఇంకా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారని తెలిసిందే. అలా కొంత కాలం క్రితం కోలీవుడ్ నుంచి యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన చిత్రం “విక్రమ్” ని విడుదల చేయగా తెలుగులో సూపర్‌ హిట్‌ కొట్టారు.

మరి మళ్ళీ అదే కమల్ హాసన్ నిర్మాణంలో వస్తున్న యంగ్ హీరో శివ కార్తికేయన్ సినిమా “అమరన్” ని తెలుగులో విడుదల చేస్తున్నట్టుగా ఇపుడు శ్రేష్ట్ మూవీస్ వారు ప్రకటించారు. అలాగే అప్పుడు విక్రమ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కమల్ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాని మిలటరీ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్‌ వహించారు. అలాగే దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles